వెంకటేష్ చేతుల మీదుగా..’ ఫలక్ నుమా దాస్’ ట్రైలర్..!

0
76
falaknumadas trailer venkatesh

విశ్వాంక్ షేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫలక్ నుమా దాస్’. ఈ చిత్రములో విశ్వక్ సేన్, వివేక్ సాగర్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరాటే రాజు నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. ఈ సినిమాకు సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ను తాజాగా విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.

ట్రైలర్ లో చిన్నపుడు ఇద్దరు స్నేహితులు.. వారిలో ఒకరు “ఫలక్ నుమా లో మన ఏజ్ గ్రూప్ లో మనల్ని కొట్టేటోళ్లే లేరు. ఇక మనం పెద్దై .. వెరిటోళ్లను కొట్టుడే ..” అని హైదరాబాద్ లాంగ్వేజ్ లో మస్తుగా చెప్పారు. ఇక వారు పెద్దయ్యాక చేసే పనులను ట్రైలర్ లో చూపించారు. యాక్షన్ , రొమాన్స్ , వ్యాపారం , చిల్లర గొడవలు .. అన్ని కట్ చేస్తూ చూపించిన సీన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. ఈ తొట్టిగ్యాంగ్ చేస్తున్న పనులు అంతా ఇంతా కాదు.

ఈ గ్యాంగ్ కి సపోర్ట్ ఇస్తూ పోలీసుల వెంట తిరుగుతూ కష్టాలు పడుతుంటాడు ఉత్తేజ్. సలోని మిశ్రా , హర్షిత గౌర్ , ప్రశాంతి తదితరులు నటిస్తున్నారు. ఇండస్ట్రీ లో వెంకటేష్ హస్తం మంచిదని, ఆయన చేతుల మీదుగా ఏది జరిగిన హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ చిత్రం తప్పక హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.