ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్ల ఇబ్బందులు అసలు ఏం జరిగిందో తెలుసా ?

0
88
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్ల ఇబ్బందులు అసలు ఏం జరిగిందో తెలుసా ?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్ల ఇబ్బందులు అసలు ఏం జరిగిందో తెలుసా ?

షేరింగ్, కామెట్స్, లైక్స్ తో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది యూజర్లను బుధవారం అర్థరాత్రి నుంచి ఇబ్బందులకు గురిచేశాయి. ఈ రెండు ప్లాట్‌ ఫామ్‌ లలో పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యం కాలేదు. ఒకపక్క మెసేంజర్ మొబైల్ యాప్ బాగానే పనిచేసినప్పటికీ.. డెస్క్ టాప్‌లో మాత్రం లోడ్ కాలేదు. ఫేస్‌బుక్‌ కి చెందిన యాప్‌ లలో వాట్సప్ మాత్రమే కరెక్ట్‌ గా పని చేసింది.

అప్పుడే మెయిన్‌ టేనెన్స్ కారణంగా ఫేస్‌బుక్ డౌన్ అయ్యిందని… కొద్ది నిమిషాల్లో అంతా సెట్ అవుతుందనే మేసేజ్‌లు దర్శనం ఇవ్వగా ఏమైందో అర్థంకాక యూజర్లు కంగారుపడ్డారు. భారత్‌ తోపాటు లాటిన్ అమెరికా, ఇంగ్లాండ్,  ఫిలిప్ఫిన్స్, వాషింగ్టన్ టెక్సాస్, తదితర ప్రాంతాల్లో ఫేస్‌ బుక్ సరిగా పని చేయట్లేదని తెలిసింది. గతంలో గూగుల్‌, జీ-మెయిల్ లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తాయి.

కానీ బుధవారం ఉదయం యూట్యూబ్‌ లోనూ ఇలాంటి సమస్యలే తలెత్తడంతో.. సోషల్ మీడియా సైట్స్ పై సైబర్ దాడికి కుట్ర జరుగుతుందా ? అనే కోణంలో నిపుణులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో “ఫేస్‌ బుక్”లో తలెత్తిన అసలు సమస్య గురించి, ట్విటర్ ద్వారా ఫేస్‌బుక్ తన యూజర్లకు వివరణ ఇచ్చింది. అందులో “డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు తికమకపడుతున్నారని, ఇంటర్నల్ ఎర్రర్ కారణంగానే ఇలా జరిగినట్టు గుర్తించామని, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను అధిగమిస్తామని వివరణ ఇచ్చింది.