36 గంట‌లు కావ‌స్తున్నా.. దొర‌క‌ని మాజీ ఎంపీటీసీ ఆచూకీ..!

0
95

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల‌మండ‌లం కొత్తూరు గ్రామంలో కిడ్నాప్ కేసు క‌ల‌కలం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ న‌ల్లూరి శ్రీ‌నివాస్‌ను కొంద‌రు మావోయిస్టులు తీసుకెళ్లారు. ఒక్క‌సారిగా దాదాపు 20 మంది సాయుధ మావోయిస్టులు ఇంటిపై దాడిచేసి శ్రీ‌నివాస్‌ను అప‌హ‌రించుకుపోయారు. ఈ క్ర‌మంలో తండ్రి కోసం అడ్డుప‌డిన అత‌ని కుమారుడ్ని సైతం తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

శ్రీ‌నివాస్‌ను కిడ్నాప్ చేసి రెండు రోజులు కావ‌స్తున్నా.. శ్రీ‌నివాస్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఆచూకీ దొర‌క్క కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌తో ఎదురు చూస్తున్నారు. త‌న భ‌ర్త‌కు ఎటువంటి హాని త‌ల‌పెట్ట‌కుండా విడిచిపెట్టాల‌ని శ్రీ‌నివాస్ భార్య క‌న్నీటితో వేడుకుంటోంది. పెద్ద‌మ‌డి సీలేరు గ్రామ శివారులోని 70 ఎక‌రాల సాగుభూమి వ‌ల్ల ఏర్ప‌డిన వివాద‌మే కార‌ణంగా తెలుస్తోంది.