మాజీ ఎంపీ శివ ప్రసాద్ చిన్న అల్లుడి ప‌రిస్థితి ఏంటి..?

0
361

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా చ‌ర్చ మొత్తం చిత్తూరు రాజ‌కీయ కుటుంబాల గురించే జ‌రుగుతుంద‌న‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. జిల్లాలోని రాజ‌కీయ కుటుంబాల విష‌యానికొస్తే, నారా వారి కుటుంబం, న‌ల్లారి, పెద్దిరెడ్డి, భూమ‌న‌, గాలి, బొజ్జ‌ల ఇలా చాలా కుటుంబాలు రాజ‌కీయాల‌ప‌రంగా బ‌రిలో ఉన్నాయి. వా

పైన పేర్కొన్న కుటుంబాల నుంచి ముఖ్య నాయ‌కులే కాకుండా వారి వార‌సులు సైతం ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచారు. తండ్రితోపాటు ఎన్నికల్లో నిలిచి ఓడిన వారు కొంద‌రైతే కుటుంబ స‌భ్యుల అండ‌దండ‌ల‌తో బ‌రిలో నిలిచి గెలుపొందిన వారు ఇంకొంద‌రు. ఇలా ఎన్నిక‌ల ఫ‌లితాలు కొంద‌రి రాజ‌కీయ నాయ‌కుల కుటుంబాల్లో ఆనందం నింపితే.. మ‌రికొన్ని కుటుంబాల్లో మిశ్ర‌మ వాతావ‌రణాన్ని నింపాయి.

ఆ విష‌యానికే వ‌స్తే.., స‌త్య‌వేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా అలాగే చిత్తూరు ఎంపీగా రెండుసార్లు ప‌నిచేసిన డా.శివ‌ప్ర‌సాద్ కుటుంబంలో ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు తీవ్ర నిరాశ‌ను నింపాయి. శివప్ర‌సాద్ చిత్తూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

అలాగే ఆయ‌న చిన్న అల్లుడు న‌ర‌సింహా ప్ర‌సాద్ క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా టీడీపీ త‌రుపున బ‌రిలో నిలిచి ఓట‌మిని చ‌వి చూశారు. ఇలా టీడీపీ అధిష్టానాన్ని ఒప్పించి మ‌రీ చిన్న‌ల్లుడికి టికెట్ వ‌చ్చేలా చేసినా.., విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌లేని మామ‌ల లిస్టులో శివ ప్ర‌సాద్ చేరారు. ఇలా వైసీపీ ప్ర‌త్యర్ధ‌పార్టీల్లోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల ఫ్యామిలీల నుంచి పోటీచేసిన వారంద‌రూ ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో డిపాజిట్‌ల‌తో స‌రిపెట్టుకున్నారు.