ఏన్నా.. ఎట్లిదీ..?

0
255

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై టీడీపీ నేత శివ‌ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజు ఎంతో ఆనందంగా కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లాన‌ని, ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయి..? ఏమేమి విశేషాలు జ‌ర‌గ‌బోతున్నాయి..? ఎంత ఫేవ‌ర‌బుల్‌గా ఉండ‌నుంది..? అంటూ ఆలోచిస్తూ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాన‌ని, కానీ త‌న ఫ‌లితంలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా షాకింగ్ ఫ‌లితాలు వచ్చాయ‌ని శివ ప్ర‌సాద్ అన్నారు.

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మే అయినా, కానీ ఇంత దారుణ ఫ‌లితాలు ఎవ్వ‌రూ ఊహించ‌లేద‌న్నారు. అయినా 175 స్థానాల్లో వైసీపీ 150కి పైగా స్థానాల‌ను గెల‌వ‌డం వెనుక ఏదో అంతు చిక్క‌ని ర‌హస్య‌ముంద‌ని ఆయ‌న అన్నారు. అదే స‌మ‌యంలో ఏన్నా.. ఎట్లిదీ..? అంటూ మీడియా ప్ర‌తినిధిని సైతం ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సారి తాను ఎంపీగా హ్యాట్రిక్ కొడ‌దామ‌ని భావించాన‌ని, కానీ కొంద‌రు ట్రిక్ ప్లే చేయ‌డం వ‌ల్ల అది కాస్తా మిస్ అయింద‌ని శివ ప్ర‌సాద్ అన్నారు.