జ‌గ‌న్ అడిగింది ఒక్క ఛాన్సే క‌దా : మాజీ మంత్రి య‌న‌మ‌ల‌

0
388

ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మ‌త్రి హోదాను అనుభ‌విస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అడిగింది ఒక్క ఛాన్సే క‌దా, ఆ నినాదానికి అనుగుణంగానే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జల తీర్పు కూడా ఉండ‌నుంద‌ని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు.

శాస‌న మండ‌లి స‌మావేశాల్లో భాగంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీసాక్షిగా తీర్మానాలు చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఎటువంటి ఫ‌లితం లేక‌పోయింద‌ని య‌న‌మ‌ల అన్నారు.

సాక్ష్యాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్ర‌త్యేక హోదాపై త‌మ ప్ర‌భుత్వం చేసిన తీర్మానాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విమ‌ర్శించారు. వైసీపీ త‌న హామీల‌ను నెర‌వేర్చ‌డం కోసం త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేయ‌డం విడ్డూర‌మ‌న్నారు.