జ‌గ‌న్ పాల‌న భేషుగ్గా ఉంది : మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి

0
264

ఏపీ ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న ప్ర‌స్తుతం భేషుగ్గా ఉంద‌ని, జ‌గ‌న్ త‌న పాల‌న‌ను ఇలానే ఐదేళ్ల‌పాటు కొన‌సాగిస్తే తామంతా అభిమానిస్తామ‌ని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు. కాగా, ఈ రోజు అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రిగిన టీడీపీ వ‌ర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈవీఎంల వ‌ల్లే టీడీపీ ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింద‌ని, ఈవీఎంల‌లో అక్ర‌మాల‌పై రానున్న రోజుల్లో త‌మ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంద‌ని ఆది నారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌నను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎంపీగా పోటీ చేయ‌మ‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని అభివృద్ధిని టీడీపీ ప్ర‌భుత్వం చేసి చూపించింద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు.