పిల్ల‌ల్ని ఏ బడికి పంపినా..ఆ త‌ల్లికి ఏడాదికి రూ.15 వేలు

0
155

వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఒక అద్భుత‌మైన ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి పేరిట పిల్ల‌ల్ని బ‌డికి పంపే ప్ర‌తీ త‌ల్లికి ఏడాదికి రూ. 15వేలు అందించ‌బోతోంది. అయితే, మొన్న‌టివ‌ర‌కూ ఈ ప‌థకంపైన సందేహాలున్నాయి.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పంపే పిల్ల‌ల త‌ల్లల‌కే సొమ్ము ఇస్తారా లేక ప్ర‌యివేటు స్కూళ్ల‌కు పాపినా ఇస్తారా అన్న అనుమానాలు అమ్మ‌ల్ని ఆవ‌హించాయి. తాజాగా దీనిపై స‌ర్కారు స్ప‌ష్ట‌త నిచ్చింది. త‌మ‌ పిల్ల‌ల్ని ఏ స్కూలుకు పంపినా డ‌బ్బులిస్తామ‌ని తెలిపారు.

తల్లులు తమ పిల్లల్ని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో దేనికి పంపించినా సరే ‘అమ్మ ఒడి’ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు, అపోహలకు తావులేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అమ్మఒడి పథకం అమలుపై త్వరలో పూర్తి విధివిధానాలు ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.