పెళ్లికి ముందు ఇష్ట‌పూర్వ‌క శృంగారం.. అత్యాచారంతో స‌మానం..!

0
105

పెళ్లికి ముందు యువ‌తి, యువ‌కుడు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారంతో స‌మాన‌మ‌ని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇద్ద‌రి ఇష్టానుసారంగా శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారం కింద‌కే వ‌స్తుంద‌ని జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర‌రావు ఎంఆర్ షాల‌తో కూడిన బెంచ్ వెల్ల‌డించింది. కాగా, సోని అనే యువ‌తి సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్‌పై విచార‌ణలో భాగంగా సుప్రీం కోర్టు పై విధంగా స్పిందించింది.

సోని సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బిలాస్‌పూర్ కోని ప్రాంతానికి చెందిన డా.అనురాగ్ వ‌ద్ద‌కు తాను వైద్యం కోసం వెళ్లాల‌ని, అదే స‌మ‌యంలో నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటూ మాట‌ల‌తో న‌మ్మ‌బ‌లికాడ‌ని, చనువు తీసుకుని త‌న‌తో శృంగారంలో కూడా పాల్గొన్నాడ‌ని సోని సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొంది.

కొన్ని రోజుల‌పాటు స‌హ‌జీవ‌నం చేసిన త‌రువాత పెళ్లి ప్ర‌స్తావ‌న రాగానే ముఖం చాటేశాడని, పెళ్లి చేసుకోనంటూ త‌న‌కు అన్యాయం చేశాడని, త‌న‌కు న్యాయం చేయాలంటూ సోని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. సోని పిటిష‌న్‌ను ఇవాళ విచారించిన జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర‌రావు ఎంఆర్ షాల‌తో కూడిన బెంచ్ పెళ్లికి ముందు శృంగారం అత్యాచారంతో స‌మాన‌మ‌ని పేర్కొంది.

సోనిని మోసం చేసిన డా.అనురాగ్‌పై కేసు న‌మోదుచేసి ఏడేళ్లపాటు శిక్ష విధించింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని మోస‌పోయిన యువ‌తుల బాధలు ఎలా ఉంటాయోన‌న్న ఆలోచ‌న వ‌స్తేనే చాలా ఆవేద‌నగా ఉందంటూ జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర‌రావు ఎంఆర్ షాల‌తో కూడిన బెంచ్ పేర్కొంది.