18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముగిసిన ఎన్నిక‌లు..!

0
211

లోక్‌స‌భ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. చ‌త్తీస్‌ఘ‌డ్, బ‌స్త‌ర్ వంటి చోట్ల చిన్న చిత‌క ఘ‌ట‌న‌లు మిన‌హా, ఏపీలో చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా ఓవ‌రాల్‌గా ప్ర‌శాంతంగానే ముగిసింద‌ని అదికారులు తెలిపారు. మొద‌టి ద‌శ‌లో మొత్తం 91 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 1239 మంది అభ్య‌ర్ధుల ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైంది.

18 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ల‌క్షా 70 వేల పోలింగ్ బూత్‌ల‌లో పోలింగ్ జ‌రిగింది. యూపీలో ఎన్నిక‌లు జ‌రిగిన ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల‌కు పూర్తైంది. యూపీలో 64 శాతం ఓట్లు పోలైన‌ట్లు అధికారులు తెలిపారు.
బీహార్‌లో నాలుగు లోక్‌స‌భ సీట్ల‌కు జరిగిన పోలింగ్‌లో మొత్తం 50.2 ఓట్లు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నిక‌ల మొద‌టి ఫేజ్ పూర్తైంది. అక్క‌డ 68 శాతం ఓట్లు పోల‌య్యాయి.