ఎన్నిక‌ల ఫ‌లితాలు షాక్‌కు గురిచేశాయి : కేశినేని నాని

0
127

ఏపీ సార్వత్రిక ఫ‌లితాలు త‌న‌ను షాక్‌కు గురి చేశాయని టీడీపీ నేత కేశినేని నాని అన్నారు. కాగా, గురువారం నాడు వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కేశినేని నాని విజ‌య‌వాడ ఎంపీగా మ‌రోసారి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై త్వ‌ర‌లో పార్టీ ముఖ్య నేత‌లంతా క‌లిసి విశ్లేష‌ణ చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. బెజ‌వాడ‌ను, త‌న‌ను విడ‌దీసి చూడ‌లేర‌ని, ఆ క్ర‌మంలోనే త‌న‌ను ప్ర‌జ‌లు ఎంపీగా మ‌ళ్లీ గెలిపించార‌న్నారు.

ముఖ్యంగా గ‌డిచిన ఐదేళ్ల‌పై విశ్లేష‌ణ చేయ‌డంతోపాటు ప్ర‌జ‌లు టీడీపీని ఎందుకు నిరాక‌రించారు..? జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎందుకు ఆద‌రించారు..? అన్న అంశాల‌పై చ‌ర్చ‌లు చేసి, 2024 క‌ల్లా మ‌ళ్లీ టీడీపీ పుంజుకుంటుంద‌ని కేశినేని నాని అన్నారు.