ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుద‌ల : ముఖ్య తేదీలు ఇవే..!

0
156

దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ రోజు 11 గంట‌ల నుంచి ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయ‌ద‌ల‌చిన అభ్య‌ర్థులు వారి నామినేష‌న్‌ల‌ను దాఖ‌లు చేసుకోవ‌చ్చ‌ని ఏపీ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్ధులు నామినేష‌న్‌ల‌ను వేసేందుకు తుది గ‌డువు ఉంద‌ని, అభ్య‌ర్ధులు నామినేష‌న్‌ల‌ను దాఖ‌లు చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లుగా ఏపీ సీఈసీ ద్వివేది తెలిపారు. ఎన్నిక‌ల కోడ్‌ను అభ్య‌ర్ధులు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఎన్నిక‌ల సంఘం కోరింది. ఎన్నిక‌ల‌ను ఒక ప్ర‌శాంత వాతావ‌ర‌నంలో నిర్వ‌హించేందుకు అభ్య‌ర్ధులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

అలాగే, ఇవాళ ప్రారంభ‌మైన నామినేష‌న్‌ల ప్ర‌క్రియ ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. 26న నామినేష‌న్‌ల ప‌రిశీల‌న‌, మార్చి 28వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్‌ల ఉప సంహ‌ర‌ణ‌కు గుడువు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, మే 23న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం అధికారులు తెలిపారు.