సీ‌ఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు : హిందువులను అవమానించారా..!

0
122
సీ‌ఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు : హిందువులను అవమానించారా..!
సీ‌ఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు : హిందువులను అవమానించారా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం పూర్తయ్యింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా జరగనుంది. అందుకోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. అసలు విషయానికి వెళ్తే.. మార్చి 17న కరీంనగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో CM కేసీఆర్ హిందువుల పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ విభాగం అధ్యక్షుడు రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు రామరాజు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల తమకు వివరణ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. మరీ కే‌సి‌ఆర్ వివరణ ఇస్తారా ? లేక ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెబుతారా ? అనేది చూడాలి.