బ్రేకింగ్ న్యూస్ : AP లో డమ్మీ ఈవీఎంల కలకలం – అసలేం జరుగుతుంది ?

0
172
బ్రేకింగ్ న్యూస్ : AP లో డమ్మీ ఈవీఎంల కలకలం - అసలేం జరుగుతుంది ?
బ్రేకింగ్ న్యూస్ : AP లో డమ్మీ ఈవీఎంల కలకలం - అసలేం జరుగుతుంది ?

ఎన్నికల వేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూడిని వింతలను చూడాల్సి వస్తుంది అంటున్నారు ఓటర్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.. నరసన్నపాలెంలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. కొయ్యలగూడెం మండలం, నరసన్నపాలెంలో పోలీసులు సాదారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. వీటిని హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు.

పట్టుపడ్డ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్ కి తరలించారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో పోలవరంలో YCP పార్టీకి చెందిన ఓ నాయకుడికి కొన్ని డమ్మీ ఈవీఎంలను అప్పగించి మిగతావి విశాఖ జిల్లాకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది.. ఎంత అబద్దం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.