హీరోగా డీఎస్పీ.. ఆ ఒక్క కార‌ణంతో హిట్ ప‌క్కా..!

0
152

మ్యూజిక‌ల్ సెన్షేష‌న్ దేవి శ్రీ ప్ర‌సాద్‌కు హీరోల‌కు ఉన్నంత క్రేజ్ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ క్రేజే అతనికి రాక్‌స్టార్ అన్న ఫేమ్‌ను కూడా తీసుకొచ్చింది. అంతేకాదు టాలీవుడ్, కోలీవుడ్, ఇలా సౌత్ సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి హీరోల్లోను, హీరోయిన్ల‌లోను ఎంతో క్రేజ్ ఉంది. ఆ క్రేజే దేవీ శ్రీ ప్ర‌సాద్‌కు ఉన్న స్టార్‌డ‌మ్‌ను తెలియ‌జేస్తుంది.

దేవి శ్రీ ప్ర‌సాద్ కేవ‌లం మ్యూజిక్ కంపోజ్ చేయ‌డంలోనే కాదు స్టేజ్ మీద ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌డంలోను డీఎస్‌పీ సూప‌ర్ అనిపించుకున్నాడు. అందుకే డీఎస్పీని హీరోగాపెట్టి సినిమా చేయాల‌ని ప‌లువురు నిర్మాత‌లు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. త‌న‌కు కూడా హీరోగా చేయాల‌ని ఉంద‌న్న డ్రీమ్‌ను దేవి శ్రీ ప్ర‌సాద్ ఒకానొక సంద‌ర్భంంలో బ‌య‌ట‌పెట్టాడు కూడా. ఆ డ్రీమ్ ఇప్పుడు నెర‌వేరనుంద‌ని టాలీవుడ్ టాక్‌.

అయితే, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దిల్‌రాజు ముందుకొచ్చినా ఆ స‌మ‌యంలో దేవి శ్రీ ప్ర‌సాద్ ఎందుకో ముద‌డుగు వేయ‌లేక‌పోయాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోయింది. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించ‌నున్న చిత్రంలో దేవి శ్రీ ప్ర‌సాద్ హీరోగా న‌టించ‌నున్నాడ‌న్న టాక్ టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

సుకుమార్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. అయితే, సుకుమార్‌కు, దేవి శ్రీ ప్ర‌సాద్‌కు మ‌ధ్య ఉన్న బాండింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం ఆర్య నుంచి మొన్న‌టి రంగ‌స్థ‌లం వ‌ర‌కు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య మాంచి బాండింగ్ ఏర్ప‌డింది. అలా ఏర్ప‌డిన బాండింగే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో చిత్రం తెర‌క్కేలా స‌హాయ‌ప‌డింద‌ని చిత్ర‌పురి కాల‌నీ వాసుల టాక్‌.