టాలీవుడ్ తెరపై మ‌ళ్లీ డ్ర‌గ్స్ కేసు..62 మంది హీరో, హీరోయిన్లపై..!

0
180

టాలీవుడ్‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. కాగా, టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి 62 మంది హీరో, హీరోయిన్ల పేరు లేకుండానే విచార‌ణ చేసిన సిట్ అధికారులు నాలుగు ఛార్జ్‌షీట్ల‌ను దాఖ‌లు చేసింది. సినీ తారాగ‌ణంలోని ప్ర‌ముఖుల నుంచి గోర్ల‌ను, వెంట్రుక‌ల న‌మూనాల‌ను సేక‌రించిన సిట్ ఇప్పుడు వారి పేర్ల‌ను ఎక్క‌డా చేర్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో సెల‌బ్రెటీల‌కు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్ల‌యింది. నాలుగు చార్జ్‌షీట్‌ల‌లోలోని ఒక‌దానిలో సౌత్ ఆఫ్రికా పౌరుడు ర‌ఫెల్ అలెక్స్ విక్ట‌ర్‌పైన దాఖ‌లు చేశారు. ముంబై నుంచి హైద‌రాబాద్‌కు కొకైక్‌ను త‌ర‌లించి విక్ర‌యిస్తున్నాడంటూ 2017లోనే సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.