దేవరకొండ ‘దొరసాని’ ప్రీ లుక్..!

0
228
dorasani pre look

యూత్ క్రేజ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ యంగ్ మాన్ జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి , యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకే చిత్ర షూటింగ్ కొంతవరకు పూర్తిచేసుకుంది.

తాజాగా కొద్దీ కాలం ముందట మూవీ నుంచి ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నెల 30వ తేదీన ఫస్టులుక్ ను విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ఇంట్రెస్టింగ్ టైటిల్ ‘దొరసాని’ అని వార్తలు వస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరు దొరసాని మూవీతోనే చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. దాదాపుగా సినిమాంత తెలంగాణ యాష, బాష తో కూడిన కథాసారాంశాలతో సాగనుంది. టైటిల్ తోనే మార్కులు కొట్టేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.