వీడియో : చిరుత‌పులిని చంపేసిన కుక్క‌లు

0
141

వీధికుక్కలు చుట్టుముట్టి ఏకంగా చిరుతపులిని చంపేశాయి. కుక్క‌ల గుంపుతో పోరాడలేక అల‌సి సొల‌సి చివరికి ప్రాణాలు వదిలింది ఆ చిరుత‌. చిరుత‌ కాసేపు ప్రతిఘటించినా చివరికి ఓడిపోయింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. చూసేందుకు చాలా హృద‌య‌విదార‌కంగా ఉందీ ఘ‌ట‌న‌.

కుక్కల దాడిలో అత్యంత దయనీయంగా ఆ చిరుత‌పులి మృతి చెందిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కర్ణాటక-కేరళ సరిహద్దులో కేరళలోని కాల్పెట్టా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.