వాప‌మ‌క్షాలు – జ‌న‌సేన పొత్తు బెడిసికొట్ట‌నుందా..?

0
139

ఏపీలో జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాల పొత్తు బెడిసికొట్టేలా ఉంది. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లో జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌డంతో లెఫ్ట్ పార్టీలు మండిప‌డుతున్నాయి. పొత్తులో భాగంగా నూజివీడు సీటు సీపీఐకి ద‌క్కింది. కానీ, ఆ త‌రువాత జ‌న‌సేన ఆ సీటు త‌మ‌కే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిది.

అలాగే బెజ‌వాడ ఎంపీ సీటును లెఫ్ట్‌కు కేటాయించారు. అక్క‌డ కూడా పొత్తు ధ‌ర్మాన్ని మ‌రిచి జ‌న‌సేన అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించింది. దీంతో ప‌వ‌న్ తీరుపై గుర్రుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు అంత‌ర్గ‌తంగా స‌మావేశ‌మై ఇదే అంశంపై చ‌ర్చించాయి. అయితే, దీనిపై జ‌న‌సేన నుంచి వ‌చ్చే స్పంద‌న‌నుబ‌ట్టి ఓ నిర్ణ‌యానికి రావాల‌ని వామ‌ప‌క్షాలు భావిస్తున్నాయి .