ప‌సుపు రంగు చీర‌లో అందాల‌ను ఆర‌బోసిన దిశా..!

0
121

హీరోయిన్‌ల‌కు లిఫ్ట్ ఇవ్వ‌డంలో స‌ల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడ‌న్న విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే క‌త్రినా కైఫ్, సోనాక్షి సిన్హాల‌కు వ‌రుస ఛాన్స్‌ల‌తోపాటు హిట్స్ ఇచ్చి అమాంతం క్రేజీ హీరోయిన్స్‌ని చేసేశాడు. అలా స‌ల్మాన్ ఆశీస్సులు ద‌క్కించుకున్న భామ‌ల్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఒక‌రు. స‌ల్మాన్ స‌ర‌స‌న కిక్ సినిమాలో న‌టించి స్టార్ హీరోయిన్ రేంజ్‌ను చేరుకుంది.

అలా త‌న చేతుల‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునే అవ‌కాశాన్ని దిశా ప‌టానికి ఇచ్చాడు స‌ల్మాన్ ఖాన్.
అయితే, భాగి- 2, ఎంఎస్ ధోని వంటి హిట్స్ సినిమాల్లో దిశా ప‌టాని న‌టించినా క్రేజీ స్టార్ కాలేక‌పోయింది. స‌ల్మాన్ ఖాన్ అండ‌దండ‌ల‌తో భార‌త్‌లో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ఆ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా రిలీజ్ చేసిన స్లోమోష‌న్ పాట చూస్తుంటే ప‌సుపు ప‌చ్చ చీర చాటున అందాలు ఆర‌బోస్తూ దిశా ప‌టాని రెచ్చిపోయింది.

స‌ల్మాన్ ఖాన్ సినిమా ఫ్లాప్ అయినా ఇండియాలో మినిమ‌మ్ రూ.200 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం గ్యారెంటీ. ఇక హిట్ అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈజీగా రూ.500 కోట్లు దాటేయ‌డం ఖాయం. ఇలా త‌న‌కు ఇంత వ‌ర‌కు రాని స్టార్‌డ‌మ్ భార‌త్ మూవీతో స‌ల్మాన్ తీసుకొస్తాడ‌ని దిశా ఆశతో ఉంది.