చెట్లెమ్మ‌ట‌.. పుట్లెమ్మ‌ట తిర‌గ‌డ‌మేగా..!

0
161

అవును, అది నిజ‌మేగా..! ప్ర‌స్తుత కాలంలో ప్రేమికుల‌మంటూ చెప్పుకుంటున్న వారు చెట్లెన‌క‌, పుట్లెన‌క తిరుగుతున్న వారేగా అంటూ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ చెప్పారు. త‌న‌ది అరేంజ్డ్ క‌మ్ ల‌వ్ మ్యారేజ‌ని, ముందుగానే పెళ్లిచూపులు జ‌రిగి, ఆ త‌రువాత తామిద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని తెలిపాడు. కాగా, క‌మెడియ‌న్ అలీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ బుల్లితెర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డైరెక్ట‌ర్ తేజ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌తోపోలిస్తే బాలీవుడ్ హీరోలు చాలా మంచోళ్ల‌ని చెప్పిన డైరెక్ట‌ర్ తేజ అందుకు ఉదాహ‌ర‌ణ చెప్తూ.. అమీర్‌ఖాన్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ చిన్న సందులో నిల‌బ‌డి ధూమ‌పానం చేస్తూ ఉండ‌గా, లైటింగ్ బాయ్ లైట్ తీసుకుని ఆ సందులో వెళ్తూ సార్ కొంచెం జ‌ర‌గండి అన‌గానే వెంట‌నే అమీర్ ఖాన్ గోడ‌కు అతుక్కుపోయి ఆ బాయ్‌కు దారి ఇచ్చాడ‌ని, అదే టాలీవుడ్‌లో అయితే వాడు న‌న్ను ప‌క్క‌కు జ‌ర‌గ‌మంటాడా..? అంటూ హీరో సినిమాను వాయిదా వేసేవారంటూ, ఫ‌న్నీకామెంట్ చేశారు.