వైఎస్ఆర్ యాత్ర‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఫిదా..!

0
104

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్యంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ్ తెర‌కెక్కించిన యాత్ర మూవీపై సినీ విశ్లేష‌కుల‌తోపాటు ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని యాత్ర సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన యాత్ర మూవీ పాజిటివ్ టాక్‌తో సినీ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను పొందుతోంది.

ఇలా యాత్ర మూవీపై ప్ర‌శంస‌లు కురిపించిన ప్ర‌ముఖుల లిస్టులో సురేంద‌ర్‌రెడ్డి చేరిపోయారు. ఆదివారం రాత్రి తాను యాత్ర మూవీ చూశాన‌ని, సినిమా చూసినంత‌సేపూ తెర‌పై వైఎస్ఆర్ మ‌ళ్లీ తిరిగొచ్చిన‌ట్టుగా అనిపించింద‌న్నారు. అంత‌లా మ‌మ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టించార‌న్నారు. వైఎస్ఆర్ హావ‌భావాల‌ను పండించ‌డంలో ముమ్మ‌ట్టి వంద‌కు వంద శాతం న్యాయం చేశార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి యాత్ర చిత్ర బృందానికి త‌న అభినంద‌న‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.