జగన్ గద్దెనెక్కుతున్న సమయాన.. దర్శకేంద్రుడి రాజీనామా..!

0
208

దర్శకుడు రాఘవేంద్రవరావు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందె. ఒక వేళా సినిమాలు చేసినా భక్తిరస చిత్రాలను మాత్రమే తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. కొంతకాలంగా అవి కూడా చేయటం లేదు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ కి చైర్మన్‌గా వ్యవహరిస్తూ దేవుడి సేవ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పదవికి కూడా రాజీనామా చేశారు.

దర్శకేంద్రుడు రాజీనామా చేయడానికి గల ప్రత్యేకమైన కారణాలేంటని చెప్పలేదు. కేవలం తన వయస్సు పై పడటం వలన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్న సమయంలోనే.. రాఘవేంద్ర రావు రాజీనామా చేయడం కొందరిలో కొత్త అనుమానలు రేకెత్తిస్తున్నాయి. జగన్ గద్దెనెక్కుతున్న సమయాన.. దర్శకేంద్రుడు కావాలనే పదవికి రాజీనామా చేశాడు. వయోవృద్ది కారణము చూపుతున్నాడన్నట్లు అభిప్రాయపడుతున్నారు.

దాదాపుగా ముందు నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ వివాదాములో ఉంది కానీ ఉన్నట్టుండి రాఘ‌వేంద్ర‌రావు తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చివరగా టీటీడి యాజమాన్యమునకు మరియు సిబ్బంది అందరికి ఏడుకొండల స్వామి దీవెనలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు రాఘవేంద్రరావు.