లోకులు కాకులు ఆంటీకి పూరి బంఫర్ ఆఫర్..!

0
98

గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్, యూట్యూబ్,టిక్ టాక్ ఇలా ప్రతి సోషల్ మీడియా సైట్స్ ఏది ఓపెన్ చేసిన మనకు ముందుగా కనిపించేది ఒక్కరే ఆవిడే లోకులు కాకులు అంటూ తెగ సందడి చేస్తున్న వ్యక్తి జ్యోతి ఆంటీ ! ఏమి జరిగిన లోకులు కాకులు ఆంటీ ప్రత్యక్షము అవుతుంది. ఈమె గురించి ఎక్కడ చూసినా ఏదొక రకంగా మాట్లాడుకుంటారు కానీ యూట్యూబ్ లో మాత్రం ఈమె గురించి రకరాలుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈమె ఎవరని అడిగిన తన గురించి చెప్పేవారు ఎవరు లేరు. కానీ ఈ మధ్య మాత్రం తనకు ఒక కొడుకు ఉండే వాడని, ఈమె ముందే ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడని అది చూసి ఈమె మెంటల్ గా మారిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఎంత మాత్రం నిజామా, అబద్దమా అనే దానిపైనా సరిగా సమాచారం లేదు. ఈ నేపథ్యం లోకులు కాకులు ఆంటీ దర్శకుడు పూరి జగన్నాధ్ , హీరోయిన్ ఛార్మీని కలవడం చర్చనీయాంశం అయింది .

శనివారం రోజున పూరి జగన్నాధ్ ఆఫీస్ కు లోకులు కాకులు ఆంటీని పిలిపించి ఆమెతో పూరి జగన్నాధ్, ఛార్మీ మాట్లాడటం జరిగింది. వీరిద్దరిని కలిసిన లోకులు కాకులు ఆంటీ తెగ హడావుడి చేసింది. అదేమిటంటే పూరి జగన్నాధ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఆంటీకి ఒక పాత్ర ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జ్యోతి ఆంటీకి కామెడీ పాత్ర ఇస్తునట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

అయితే సోషల్ మీడియాలో ఈ ఆంటీ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కనుక ఆమెను పూరి కలిసి ఉండవచ్చు. అయితే సినిమాలో ఆఫర్ఇచ్చినట్టు మాత్రం పూర్తి సమాచారం రాలేదు. ప్రస్తుతం పూరి పరిస్థితి బాగా లేదు తను తీసిన సినిమాలో ఒకటి కూడా హిట్ కొట్టకపోవడంతో కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో పూరి ఇష్టం వచ్చినట్లుగా ప్రయోగాలు చేయడానికి ధైర్యం చేయకపోవచ్చు. ఒక వేళా ఈమె తో చిన్న కామెడీ పాత్ర వేయిస్తే సినిమాకు క్రేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ విషయమై పూరి అండ్ కో నుండి ప్రత్యేకంగా చెప్తాడో చూడాలి.