యువ రచయితలకు ఆహ్వానం..! దర్శకుడు..!!

0
192
mahi v raghavan
mahi v raghavan

‘త్రీ ఆట‌మ‌న్ లీవ్స్’ ఇదిఒక ప్రొడక్షన్ హౌస్. యువ రచయితల్ని, సినిమా కథల్ని రాసే వారిని ఆహ్వానిస్తుంది. కేవలం సినిమాలే కాదు వెబ్ సిరీస్, డాక్యుమెంట‌రీలు రాయగల సత్తా ఉంటె చాలు రండంటూ ఔత్సాహికులైన వారిని బాగస్వామ్యులుగా చేర్చుకొనుటకు సిద్ధముగా నున్నట్లు తెలిపింది.

సంప్రదాయమైన తెలుగు సినిమా ప్రొడ‌క్షన్ సంస్థల వారిలాగానే సినిమాలను నిర్మించడము, కానీ విడుద‌ల చేయు పద్దతిలో మాత్రం పూర్తి విభిన్నంగా చేయాలనుకుని త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ అడుగు ముందుకు వేసింది. మా అడుగులో అడుగు వేయాలనుకునే నవ యువ ఫిల్మ్ రైట‌ర్స్‌ని ఎంకరేజ్ చేస్తూ కొత్త కథలు తయారు చేపించడమే వారి ధ్యేయమని అన్నారు. ఒక్క మాటగా చెప్పాలంటే రైటర్ మేథ‌లో విత్తనాన్ని ఎంతో భద్రంగా పెంచి మ‌హా వృక్షముగా మలచడమే మా ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ మధ్య రిలీజ్ కాబడిన యాత్ర మూవీ కూడా సహా నిర్మాతగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ వ్యవహరించిందని తెలిపింది.

మరి ‘త్రీ ఆట‌మ‌న్ లీవ్స్’ ఎవరిదా ? ఎవరెవరున్నారా ? అని చూస్తే ఈ మధ్య విడుదలైన ‘యాత్ర’ మూవీ దర్శకుడు మ‌హి వి రాఘ‌వ్, అత‌నికి అత్యంత సన్నిహితులైన శివ‌మేక‌, రాకేష్ మహాంకాళీ కలిసి ఈ సంస్థ మొదలుపెట్టారు. వి రాఘ‌వ్ మాట్లాడుతూ కథకు, కథకులకు డబ్బులు ఇస్తూ అలా రూపుదిద్దుకున్నా స్క్రిప్ట్స్‌ని మొదటగా కాగితం మీద నిర్మించి తర్వాత నిర్మాణ సంస్థల‌కు సంబందించిన వారిని కలిసి తెరపై ఎక్కించే దిశగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫిల్మ్ మేక‌ర్స్, నిర్మాణ సంస్థలు, ఛాన‌ల్ పార్టనర్ లతో జతకుడేందుకు త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ సిద్ధంగా ఉందని ద‌ర్శ‌కులు మ‌హి వి రాఘ‌వ్, నిర్మాత‌లు శివ మేక‌, రాకేష్ మ‌హంకాళి చెప్పుకొచ్చారు.