విభేదాలు మొద‌ల‌య్యాయి : ప్రియానిక్‌

0
135

వర‌ల్డ్ మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్ ప్రియానిక్‌. స్వ‌శ‌క్తితో బాలీవుడ్ నుంచి గ్లోబల్‌ స్టార్ గా ఎదిగిన‌ ప్రియాంక చోప్రా- హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లు గతేడాది డిసెంబరులో పెళ్లిచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, వీరి సంసారంలో ఇప్పుడిప్పుడే అర‌మ‌రిక‌లు మొద‌ల‌య్యాయ‌ని చెబుతోంది ప్రియాంక‌.

‘ మొదట మేం బాగానే ఉండేవాళ్లం. కానీ పెళ్లైన తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు వ‌స్తున్నాయి. ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను. ఏం జరిగినా మన మంచికే అని నిక్‌ చెబుతాడు. అయితే ఇవన్నీ చిన్న విషయాలు. ఇంకోవిషయం.. కొంతమంది చేతులతో మాట్లాడుకుంటారు కదా.. కానీ మేము మాత్రం మనసులతోనే మాట్లాడుకుంటాం. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు’ అని భర్త గురించి చెప్పుకొచ్చింది ప్రియానిక్‌.