ఒక్క ప‌రుగు దూరంలో ధోని రికార్డ్‌..!

0
226

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ఎంఎస్‌ ధోని మ‌రో మైలురాయిని చేరుకునేందుకు సిద్ధ‌మైపోయాడు. కాగా, కెప్టెన్‌గా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వర్తించ‌డ‌మే కాకుండా, బ్యాట్స్‌మెన్‌గా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుల‌పై విరుచుకుప‌డ‌టంలో ఎం.ఎస్‌.ధోని ప్ర‌త్యేకం. ధోనీలోని ఆ కోణ‌మే ఆయ‌న్ను మ‌రో మైలు రాయికి చేరువ చేసింది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఎం.ఎస్ ధోని ఇప్ప‌టి వ‌ర‌కు త‌న క్రికెట్ కెరీర్‌లో ప‌దివేల ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, భార‌త్ త‌రుపున ఆడుతూ చేసింది ప‌రుగులు మాత్రం 9,999. ఇవాళ సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య వ‌న్డేతో ఎం.ఎస్‌.ధోని ప‌దివేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేర‌నున్నాడు. భార‌త్ త‌రుపున ప‌దివేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌, విరాట్ కోహ్లీ (భార‌త్ కెప్టెన్‌) మాత్ర‌మే ఉన్నారు.