ధోనికి ల‌తా మంగేష్క‌ర్ రిక్వెస్ట్‌..!

0
151

క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ – 2019నుంచి భార‌త్ నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌ల‌లో భార‌త్ మొద‌ట్నుంచి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తూ సెమీ ఫైన‌ల్‌కు చేరిన‌ప్ప‌టికీ మాంచెస్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓట‌మిని చ‌వి చూసింది. దీంతో ఫైన‌ల్ ఆశ‌లు కాస్తా ఆవిర‌య్యాయి.

ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ మీడియా ముందు వివ‌ర‌ణ ఇవ్వ‌గా, సోష‌ల్ మీడియాలో మాత్రం ధోనీనే టార్గెట్ చేస్తూ కొంద‌రు ట్రోల్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధోనీ ఆల్రెడీ త‌న రిటైర్మెంట్ విష‌య‌మై ఇప్ప‌టికే బీసీసీఐ వ‌ద్ద ప్ర‌స్తావించార‌ని, వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ముగిసిన వెంట‌నే క్రికెట్ ప్ర‌పంచం నుంచి ధోనీ త‌ప్పుకోనున్నాడంటూ కొన్ని క‌థనాలు ఇటీవ‌ల వైర‌ల్ కూడా అయ్యాయి. అయితే ధోనీ నుంచి మాత్రం ఎటువంటి స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ సింగ్ ల‌తా మంగేష్క‌ర్ ధోనీ రిటైర్మెంట్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇటీవ‌ల కాలంలో ధోనీ రిటైర్ కానున్నారంటూ కొన్ని పోస్టులు చూస్తున్నాన‌ని, కానీ ధోనీ అటువంటి నిర్ణ‌యం తీసుకోడ‌న్న న‌మ్మ‌కాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. భార‌త్ జ‌ట్టుకు ధోనీ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, అత‌ను ఇంకా క్రికెట్ ప్ర‌పంచంలో కొన‌సాగాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్టు ల‌తా మంగేష్క‌ర్ పేర్కొన్నారు.