ధోనీపై విజ‌య్‌దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
171

క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ – 2019లో భాగంగా భార‌త్ సెమీఫైన‌ల్‌తో వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. భార‌త్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌చ్చే అవ‌కాశ‌మున్నా అందుకు వ‌రుణుడు అడ్డుక‌ట్ట వేశాడు. వ‌ర్షం రాక‌తో మారిన పిచ్ కార‌ణంగా గ‌త సోమ‌, మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 18 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌క‌ప్‌పై ఆశ‌లుపెట్టుకున్న వారంతా కాస్త ఆవేద‌నకు గుర‌య్యార‌ని చెప్పొచ్చు.

అయితే, ఇండియా ఓట‌మిపై టాలీవుడ్ హీరో విజ‌య్‌దేర‌కొండ స్పందించాడు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా క్రికెట్ చూడ‌ట‌మే మానేసిన తాను, ఇండియా సెమీఫైన‌ల్ అడుతుంద‌ని షూటింగ్‌లో ఉన్న త‌మ బృందంతో క‌లిసి ల్యాప్‌టాప్‌లో చూశామ‌ని చెప్పారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అంతా ఒక్కొక్క‌రుగా ఫెవిలియ‌న్ బాటప‌డుతున్నా.. ధోనీ ఉన్నాడులే అనుకున్నాం.. కానీ ధోనీ కూడా హ్యాండిస్తూ ర‌న్ ఔట్‌గా వెనుదిర‌గ‌డం త‌నను బాధించింద‌ని చెప్పుకొచ్చాడు. ఇండియా ఓట‌మితో చిత్ర‌బృంద‌మంతా కాస్త నెర్వెస్‌గా ఫీల‌య్యామ‌న్నారు.

కాగా, విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరో, ర‌ష్మిక హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న డియ‌ర్ కామ్రేడ్ మూవీ ఈ నెల 26న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ మూవీకి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతం అందిస్తున్నారు.