బిగ్ బ్రేకింగ్ : దేవినేని అవినాష్ హెచ్చ‌రిక‌..!

0
128

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి నుంచి కొత్తూరు కేంద్రంగా టీడీపీ – వైసీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. కాకినాడ డీఎస్పీ ర‌వి వ‌ర్మ ప‌రిస్థితిని స‌మీక్షించారు. పాత గొడ‌వ‌లే ఈ దాడుల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌రోవైపు ఇరువ‌ర్గాల దాడిలో గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ – వైసీపీ నేత‌లు ప‌రామ‌ర్శించారు.

టీడీపీ నాయ‌కుల‌పై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత దేవినేని అవినాశ్ ఖండించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లకు పాల్ప‌డ‌లేద‌ని తెలిపారు. వైసీపీ దాడుల‌ను పోలీసులు అడ్డుకోకుంటే తాము ఎదురు తిర‌గాల్సి వ‌స్తుంద‌ని దేవినేని అవినాశ్ హెచ్చ‌రించారు.