‘మహర్షి’ ఫస్ట్ సాంగ్ ఆరోజే.. దేవి శ్రీ..!

0
215
maharshi movie
Maharshi movie first song

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహర్షి. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ హీరోగానూ నటించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ప్రిన్స్ నటించిన ‘భరత్ అనే నేను’ భారీ హిట్ సాధించింది. ఆ తరువాత వస్తున్న సినిమా కావటం , అంతే కాకుండా మహేష్ 25 వ సినిమా అవటంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ‘1 నేనొక్కడినే’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, సినిమాలకు సంగీతాన్ని సమకూర్చిన దేవిశ్రీప్రసాద్ మరోసారి మహేష్ కి మ్యూజికల్ హిట్ అందించుటకు సిద్ధమయ్యారు.

‘మహర్షి’ మూవీ  మే నెల తొమ్మిదవ తేదీన విడుదల చేయుటకు షూటింగ్ పనులు శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మంచి శుభవార్తను అందించారు దేవి శ్రీ ప్రసాద్. తన ట్విట్టర్ లో మార్చి 29 వ తేదీన ‘మహర్షి’ మూవీ ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మహేష్ ఫ్యామిలీ కి సంబందించిన వీడియో ను లింక్ చేస్తూ పోస్ట్ చేసారు. ఈ వీడియోలో దేవి చారుశీల అని పాటు పాడుతూ మహేష్ కూతురు సితార తో డాన్స్ చేస్తుండటం చూడవచ్చు. ఇటీవల సితార ‘కన్నా నిదురించరా’ అంటూ బాహుబలి లోని పాటకు డాన్స్ చేసి ఆశర్యపరిచింది. ప్రస్తుతానికి మహేష్ కూతురు సితార డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి మహేష్ అభిమానులను ఫిదా చేస్తుంది.

Maharshi
Devi sri prasad latest tweet on Maharshi