మెగా హీరో మూవీ నుంచి తప్పుకున్న దేవి శ్రీ ..! కారణమిదే

0
271
devi sri prasad

తమిళంలో భారీ హిట్ ను సాధించిన ‘జిగర్తాండ’ను తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపుదిద్దుతున్నారు. తమిళంలో బాబీ సింహ, సిద్దార్థ్ , లక్ష్మీ మీనన్ కీలకమైన పాత్రలు పోషించగా.. తెలుగులో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్.. సిద్దార్థ్ పాత్రలో అథర్వ మురళిని.. లక్ష్మీ మీనన్ పాత్రలో డ‌బ్‌స్మాష్‌తో ఫేమ్ అయినా మ్రిణాళినిరవిని నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గత నెలలో హైదరాబాద్ లో జరిగింది. వరుణ్ తేజ్ చిత్రంలో బాక్సర్ గా కనిపించపోతున్నాడు. ఇందుకోసం లాస్ ఏంజిల్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్.

మెగా ఫ్యామిలీ కి ఎప్పుడు మెగా మ్యూజిక్ హిట్ అందించే దేవీశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి దేవీశ్రీ ప్రసాద్ తప్పుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దేవి శ్రీ ఎందుకు తప్పుకుంటున్నాడు అనే కారణాలు మాత్రం అప్పట్లో తెలియలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో దర్శకుడు హరీశ్ శంకర్ రీమిక్స్ సాంగ్ ను సిద్ధం చేసుకున్నారట. ఆ సాంగ్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని.. దేవి శ్రీ ప్రసాద్ అయితే పర్ఫెక్ట్ గా సాంగ్ అందిస్తాడని భావిస్తే.. దేవి శ్రీ మాత్రం దీనికి ససేమీరా అన్నారట. కారణమేంటని చూస్తే దేవి పెట్టుకున్న నియమాలలో ఒకటి రీమిక్స్ సాంగ్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. తాను పెట్టుకున్న నియమాలకు విరుద్ధంగా చేయలేనని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. హరీష్ శంకర్ గట్టిగానే ప్రయత్నించారట కానీ ఫలితం మాత్రం శూన్యం.