భర్త ఉండగా రెండేళ్లుగా మరో వ్యక్తితో సంబందం : సమాజం సిగ్గుపడే ఘటన

0
1101
భర్త ఉండగా రెండేళ్లుగా మరో వ్యక్తితో సంబందం : సమాజం సిగ్గుపడే ఘటన
భర్త ఉండగా రెండేళ్లుగా మరో వ్యక్తితో సంబందం : సమాజం సిగ్గుపడే ఘటన

దక్షణ ఢిల్లీలోని, “తిగాడీ” పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన సమాజం సిగ్గుపడేలా చేసింది. భర్త ఉండగానే గత రెండేళ్లుగా మరో వ్యక్తితో సంబందం పెట్టుకుంది… చివరికి ఆవ్యక్తి చనిపోవడానికి కారణం అయ్యింది ఓ మహిళా. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని తిగాడీకి చెందిన ఒకవ్యక్తి తుగ్లకాబాద్‌ లో కస్టమ్ క్లియరెన్స్ ఏజెంట్ వద్ద పనిచేస్తున్నాడు. వృత్తిరిత్య ఎప్పుడు బయట  ఉండే అతడి భార్య గత రెండేళ్లుగా పంకజ్ అనే మరో వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుంది.

చాలరోజులు భర్తకు తెలియకుండా తప్పించుకున్నా ఈమద్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ముందు భర్తను చూసిన భయపడ్డట్లు నటించిన ఆమె “తప్పుచేశాను ఇప్పుడే చనిపోతాను” అంటూ కత్తితో చేతి కోసుకుంది. నిజమేనేమో అనుకున్న భర్తకు రెండు నిమిషాల్లోనే అదంతా నాటకం అని తెలిసింది. దాంతో వెంటనే భయటకు వెళ్ళి ఇంటికి తాళం వేసి ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచాడు. అంతలోనే తప్పించుకోవాలని ప్రయత్నించిన పంకజ్ మూడవ అంతస్తులోని బాల్కాని నుండి క్రిందపడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు.