చంద్ర‌బాబుకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..! ఎన్నిక‌ల వేళ ఏం జ‌రుగుతోంది..?

0
406
Chandrababu naidu speech on Amaravathi

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేస్తున్నార‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి, చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అంతేకాకుండా, వైసీపీ నేత‌ల ఫోన్‌ల ట్యాపింగ్ అంశానికి సంబంధించి స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు నోటీసులు అంద‌జేసిన‌ట్లు తెలిపింది. తామిచ్చిన నోటీసుల‌పై వారం లోగా స్పందించాల‌ని హైకోర్టు ఆదేశించ‌డంతోపాటు వైవీ సుబ్బారెడ్డి పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు పంపిన ఆ నోటీసులు మంగ‌ళ‌వారం నాడు చంద్ర‌బాబుకు అందిన‌ట్టు తెలుస్తోంది.