కపిల్ భార్య‌గా దీపిక పదుకొనె.?

0
166

దీపిక పదుకొనె, రణ్ వీర్ సింగ్ పెళ్లి తర్వాత మరో సారి జత కడుతున్నారు. సిల్వర్ స్క్రిన్‌పై దీపిక పదుకొనె, రణ్ వీర్ సింగ్ కాంబో సూపర్ హిట్ జంట. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి ఏ సినిమా చేసినా హిట్ కావడంతో దర్శకుడు కబీర్ ఖాన్ వీరిద్ద‌రితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

1983 లో కపిల్‌దేవ్‌ సారధ్యంలో టీమిండియా మొదటిసారి ప్రపంచ కప్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. మొదటి సారిగా టీమ్ ఇండియాకు ప్రపంచకప్ రావడంలో కపిల్‌దేవ్‌ ప్ర‌ధాన పాత్రను పోషించారు. ఆ విజయాన్ని ప్రధాన అంశంగా తీసుకుని, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా హిందీలో బయోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

1983లో టీమిండియా ప్రపంచ కప్ గెలవడంతో అదే సంవత్సరాని 83 అనే టైటిల్‌ను పెట్టాడు. దర్శకుడు కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. కపిల్ భార్య పాత్రలో ‘రోమి భాటియా’ గా దీపిక పదుకొనె పేరు వినిపిస్తుంది.

అయితే, 83సినిమాలో కపిల్ భార్య రోమి భాటియా గా ఎవరు నటించ‌నున్నారు.? అన్న ప్రశ్నకు చాలా మంది పేర్లు వినిపించాయి. రోమి భాటియాగా తెరపై కనిపించేది తక్కువ సేపే అయినా ప్రపంచ కప్ గెలిచిన సమయంలో ఈ విజయం చూసి కన్నీరు పెట్టుకుంది. సినిమాలోని ఈ కీలకమైన సన్నివేశాని దీపిక పదుకొనె అయితేనే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు కబీర్ ఖాన్ నమ్మకంతో ఉన్నాడ‌ట‌. ఆ మేర‌కు దీపికా ప‌దుకొనెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.