ఆగ‌ని మ‌ర‌ణాలు..!

0
106

ఇంట‌ర్ బోర్డు నిర్వాకం ఎంద‌రో విద్యార్థుల జీవితాల‌ను అంధ‌కారం చేస్తోంది. ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డిలో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌తో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఇద్ద‌రు విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి వారి కుటుంబాల్లో క‌డుపుకోత మిగిల్చారు.

షాబాద్ మండ‌టం తిరుమ‌లాపూర్‌కు చెందిన జ్యోతి చేవెళ్ల‌లోని వివేకానంద జూనియ‌ర్ క‌ళాశాల‌లో సీఈసీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. తాజాగా విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో సెకండ్ ఇయ‌ర్ సివిక్స్ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయింది. తీవ్ర మ‌న‌స్తాపం చెందిన జ్యోతి ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాల‌పాలైన ఆమెను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండగా మృతి చెందింది.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. నెక్కొండ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో  రైలుకింద‌ప‌డి త‌నువు చాలించాడు. మృతుడు రెడ్ల‌వాడ‌కు చెందిన న‌వీన్‌గా గుర్తించారు. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో అన్ని స‌బ్జెక్టులు ఫెయిల్ అయ్యాడ‌న్న మ‌న‌స్తాపంతో న‌వీన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.