కోదాడలో క‌ల‌క‌లం రేపిన విద్యార్థుల మృతి

0
228
students death
four student death in kodada

పుట్టిన రోజు వేడుక స్నేహితుల కుటుంబలో విషాదం నింపింది. స్నేహితుని పుట్టిన రోజు వేడుక చేయడనికి చెరువు వద్దకు వెళ్లిన నలుగురు పాలటెక్నీక్ విద్యార్థులు చెరువులో పడి చనిపోయారు. సూర్య పేట జిల్లా కోదాడ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చక్రాల ప్రవీణ్, ఎస్ కే సమీర్, బావని ప్రసాద్ ,ఎస్ మహేందర్ ఈ నలుగురు కోదాడ సమీమపంలోని అనంతగిరి మండల కేంద్రంలో ఉన్న అనురాగ్‌ పాలటెక్నీక్ కళాశాలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుకుంటున్నారు.

ప్రవీణ్ పుటిన రోజు కావడంతో కళాశాల కు చెందిన 20 మంది విద్యార్థులు వేడుక చేసుకోవడానికి కోదాడ పెద్ద చెరువు కట్టపై ఉన్న మైసమ్మ గుడి వద్దకు చేరుకున్నారు కేక్ కట్ చేసిన అనంతరం చేతులు కడుకోవడనికి సమీర్‌ అనే విద్యార్థి చెరువులోకి దిగి కాలు జారీ పడిపోయాడు. అతడిని కాపాడటానికి వెళ్లిన స్నేహితులు ప్రవీణ్ , ప్రసాద్, మహేందర్ల్ నీటిలో మునిగి చనిపోయారు. మిగిలిన తోటి ఇద్దరు విద్యార్థులు ఈదుకుంటూ బయటపడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే గజ ఈతగాళ్ల గాలించి, మృతదేహాలను బయటకు తీసి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను జిల్లా కలెక్టర్‌ ఆమోయ్‌కుమార్‌ సందర్శించి జరిగిన వివరాలను ఆర్డీవో, డిఎస్పీ, సిఐ లను అడిగి తెలుసుకున్నారు.