‘డియర్ కామ్రేడ్ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్.. రౌడీ గిరాకీ అదిరే..!

0
450
dear comrade
dear comrade pre release business

విజయ్ దేవరకొండ అంటే యూత్ లో క్రేజ్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అందరిని ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ కొళ్లేగెట్టేస్తున్నరౌడీ రేంజ్ ఎలా ఉందొ చూస్తే.. అర్జున్ రెడ్డి 50 కోట్లు వసులు కాగా, గీత గోవిందం సినిమా 15 కోట్ల రూపాయల బిజినెస్ కి , 75 కోట్ల‌కు పైగా పైసా వసులు చేసింది. ఆ తరువాత టాక్సీవాలా 24 కోట్ల రూపాయలను వసులు చేసింది.  బ్లాక్ బ‌స్ట‌ర్లతో సాగుతున్న హీరో రేంజ్ మరింత పెరిగి, డియ‌ర్ కామ్రేడ్ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్లు వరకు జరిగిందని సమాచారం.

గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ముద్దు గుమ్మ రెండోసారి ‘డియర్ కామ్రేడ్’ అంటూ జోడీ కట్టింది. రొమాంటిక్ కపుల్ విజయ్, రష్మిక లు నటించే ఈ సినిమాను తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కాబడిన టీజ‌ర్ కు మంచి స్పందన లభించింది. ఇండ‌స్ట్రీల్లో కూడా  సినిమాకు  మంచి బిజినెస్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. తెలుగులో 30 కోట్ల రూపాయలు వరకు అమ్ముడుపోయిందట. ముఖ్యంగా నైజాంలో 7.65 కోట్లు , సీడెడ్ లో 3.5 కోట్లు, ఆంధ్రలో 10 కోట్లకు చిత్రాన్ని అమ్మేస్తున్న‌ట్లు సమాచారం. ఓవ‌ర్సీస్ లో భారీగానే అమ్ముడు పోయాయట. తెలుగు రాష్ట్రాలతో పాటు, మిగిలిన భాష‌లలో క‌లిపి 40 కోట్ల బిజినెస్ జరగనుందని టాక్ .

విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న ఇమేజ్ కి కచ్చితంగా బిజినెస్కు డబుల్ పైసా వసులు తీసుకువస్తుంది చిత్ర యూనిట్ వారు నమ్ముతున్నారట. మే 31న సినిమాను విడుదల చేయుటకు భారీ సన్నాహాలు చేస్తున్నారు డియర్ కామ్రేడ్ యూనిట్ వారు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎంత వరకు సాధిస్తుందో వేచి చూడాలి.