మంత్ర ముగ్దులను చేస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్..!

0
374
Dear comrade first lyrical song

ఛలో, గీత గోవిందం సినిమాలలో నటించి కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన కన్నడ బ్యూటీ రష్మి. గీతా గోవిందం సినిమాలో విజయ్ సరసన నటించి లిప్ లాక్ లతో రొమాన్స్ పండించింది. ఇప్పుడు ఈ జంట కలిసి నటిస్తున్న మరో సినిమా ‘డియర్ కామ్రేడ్’. ‘గీతా గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రొమాంటిక్ కపుల్ ఈ సినిమాలో కూడా రొమాన్స్ పండించి కుర్రకారు హృదయాల్లో బాణం గుచ్చబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో లిప్ లాక్ తో ప్రేక్షకులను లాక్ చేసేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే దర్శకుడు ఇండస్ర్టీ కి పరిచయం కాబోతున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంట గా నటిస్తున్న సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరల్డ్ వైస్ రిలీజ్ చేస్తున్నారు . మే 31వ తేదీన విడుదల చేయనున్న సినిమాకి ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. కాలేజ్, ప్రేమ, రాజకీయం అన్ని కలబోసినట్లు సాగే ఈ కథకు రొమాంటిక్ కపుల్ బాగానే కష్టపడ్డారట. ఇక ఈ రోజు విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ లోకి వెళ్తే ..

‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే.. నీ కాలి అందెల్లోని సంగీతమే నీ వైపే లాగేస్తుంది నన్నే’ అంటూ సాగిన మెలోడి పాట మనసును దోచేస్తుంది . ఈ సాంగ్ వింటూ అలా నిద్రలోకి మత్తుగా జారుకోవచ్చు. గౌతమ్ భరద్వాజ్ ఆలపించిన పాటకు శ్రోతలు ముగ్దులై పోవాల్సిందే. జస్టిన్ ప్రభాకరణ్ ట్యూన్‌ కట్టగా రెహ్మాన్ లిరిక్స్ అందించడం అద్భుతంగా ఉంది. మనసును హత్తుకుని మాయ చేస్తున్న ‘ డియర్ కామ్రేడ్’ పాట మీరు వినండి..