సూపర్ స్టార్ ‘ దర్బార్ ‘ షూటింగ్ స్టార్ట్..!

0
185
darbar movie shoot in mumbai

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దర్బార్’. ఈ సినిమాలో రజినీకాంత్ కథానాయకుడిగా, నయనతార కథానాయకురాలిగా నటిస్తుంది. మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే విడుదలైన దర్బార్ ఫస్ట్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ లుక్ లో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా ఉండగా.. ఆయనతో పాటు పోలీస్ క్యాప్, పోలీస్ బెల్ట్, పోలీస్ డాగ్, గన్స్, బుల్లెట్స్ కనిపిస్తాయి.

rajinikanth darbar movie
supar star darbar movie

కొద్దీ సేపటి క్రితమే ముంబైలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. పూజ కార్యక్రమాలు పూర్తి చేసి, షూటింగ్ పనులు మొదలు పెట్టారు. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన చేశారు చిత్ర యూనిట్. అంతేకాకుండా సామజిక సేవకునిగా మరో పాత్రలో కనిపించనున్నాడట.

rajinikanth darbar movie

ముంబై బ్యాక్ డ్రాప్ గా చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు. ముంబైలో చిత్రం కోసం భారీ సెట్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల రోజుల పాటు సినిమా తొలి షెడ్యూల్ ను ముంబైలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మురుగదాస్, రజినీకాంత్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కాబట్టి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అభిమానులు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరిస్తున్నాడు.

rajinikanth darbar shoot begins today