ఆసక్తి రేపుతున్న’దర్బార్‌’ ఫస్ట్ లుక్…!

0
167
rajinikanth acting in darbar

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మురుగదాస్ దర్శకత్వం లో రూపుద్దిద్దుకుంటున్న సినిమా లో రజనీకాంత్ నటిస్తున్నా విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘దర్బార్‌’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార నటిస్తుంది . మరో హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నారు నిర్మాతలు .

ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. రేపటి నుంచి చిత్ర షూటింగ్ మొదలు పెడుతున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ గా సినిమాను రూపుదిద్దుతున్నారు. చిత్రం కోసం భారీ సెట్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల రోజుల పాటు సినిమా తొలి షెడ్యూల్ ను అక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఫస్టు లుక్ లో రజనీతో పాటు పోలీస్ క్యాప్, పోలీస్ బెల్ట్, పోలీస్ డాగ్, గన్స్, బుల్లెట్స్ వీక్షించవచ్చు. రజనీ డిఫరెంట్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. మురుగదాస్, రజినీకాంత్ కంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ వహిస్తున్నాడు.

rajinikanth
darbar first look released