మ‌రిదితో అక్ర‌మ సంబంధం.. భార్య‌ను వ‌దిలి రాలేద‌ని..!

0
435

త‌న పెళ్లి జ‌రిగిన మ‌రుస‌టి రోజునుంచి భ‌ర్త‌ను కాద‌ని మ‌రిదిపై క‌న్నేసింది. మ‌రిదిపై ఒత్తిడి తెచ్చి మ‌రీ కాపురం కూడా కొంత‌కాలం నుంచి కొన‌సాగిస్తూ వ‌చ్చింది. వీరిద్ద‌రి ప‌డ‌క‌గ‌ది సుఖాల విష‌యం తెలుసుకున్న పెద్ద‌లు కామ‌వాంచ‌తో ఉన్న ఆమెను వారించినా వారి మాట‌ను పెడ చెవిన పెట్టింది. మ‌రిదే త‌నకు అన్నీ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో చేసేది లేక వేరే మ‌హిళ‌తో మ‌రిదికి పెళ్లిచేశారు. అయినా ఆమె మార‌క‌పోగా కామ‌వాంచ‌లో చేయ‌రాని ఘోరం చేసి జైలుపాలైంది. ఈ సంఘ‌ట‌న కానూరు స‌న‌త్‌న‌గ‌ర్ సిద్ధిఖ్‌న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. స‌న‌గ్‌న‌గ‌ర్‌కు చెందిన ఫ‌రీద్, ముంతాజ్ బేగంల‌కు గ‌త 15 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరి వివాహ బంధానికి గుర్తుగా 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి నాటి నుంచి ముంతాజ్‌బేగం త‌న మ‌రిది ఖలీల్‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసిన పెద్ద‌లు ఖలీల్‌కు పెళ్లి చేస్తేనైనా ముంతాజ్‌బేగం దారికొస్తుందని భావించి నెల‌న్న‌ర రోజుల క్రితం న‌జీరున్నీసా అనే మ‌హిళ‌తో వివాహం చేశారు.

అయితే ఖ‌లీల్ వివాహం జ‌రిగిన నాటి నుంచి త‌న‌ను క‌లిసేందుకు రాక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయిన ముంతాజ్ బేగం క‌క్ష పెంచుకుని హ‌త్య‌కు కుట్ర ప‌న్నింది. ప‌డ‌క గ‌దిలో ఖ‌లీల్‌, భార్య న‌జీరున్నీసా ఇద్ద‌రూ ఉంటార‌ని భావించిన ముంతాజ్ బేగం వంట‌నూనె డ‌బ్బా నిండా పెట్రోల్ పోసుకుని వెళ్లి వారిపై చ‌ల్లింది. ఆ వెంట‌నే నిప్పంటించి గ‌దికి గ‌డియ‌పెట్టి అక్క‌డ్నుంచి ప‌రారైంది. ఖ‌లీల్ అరుపులు విని బ‌య‌ట నిద్రిస్తున్న ఆయ‌న త‌ల్లి, భార్య ఇద్ద‌రు ప‌రుగు ప‌రుగున గ‌ది వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఖ‌లీల్ భార్య బ‌య‌ట ఉండ‌టాన్ని గ‌మ‌నించిన ముంతాజ్ బేగం ఖంగుతిని అక్క‌డ్నుంచి ప‌రారైంది. మృతుడు త‌ల్లి హ‌మీదున్నీసా ఫిర్యాదు మేర‌కు విచారించిన పోలీసులు ముంతాజ్ బేగాన్ని నిందితురాలిగా గుర్తించారు.