గర్భం దాల్చిన 9వ తరగతి అమ్మాయి : అసలు నిజం తెలిస్తే..!

0
356
crime news owner son molestation 9th class girl
crime news owner son molestation 9th class girl

తల్లిదండ్రుల అజాగ్రత్త అభం, శుభం తెలియని పిల్లల జీవితాలను ఎంతలా నాశనం చేస్తుందో మరోసారి రుజువైది. కూతురు ఏం చేస్తుందో.. ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఓ తల్లి నిర్లక్ష్యం ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేసింది. కృష్ణా జిల్లా “గిలకలదిండి”కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. “గిలకలదిండి”లోని మునిసిపల్‌ హైస్కూల్‌ లో 9వ తరగతి చదువుతున్న ఆ బాలిక కడుపు నొప్పిగా ఉందని తల్లికి చెప్పటంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆ బాలికకు వైద్య పరీక్షలు చేసి ఆమె గర్భం దాల్చిందని నిర్ధారించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలిక తల్లి అదే ప్రాంతానికి చెందిన “సుభద్రమ్మ” అనే ఓ మహిళ ఇంట్లో 2 ఏళ్లుగా పనికి వెళుతోంది. ఆమె ఒక్కతే వెళ్లకుండా సాయంత్రం సమయంలో స్కూల్ తరువాత ఆ బాలికను కూడా తరచూ పనికి తీసుకెళ్ళేది. అదే అదునుగా భావించిన “సుభ్రదమ్మ” కుమారుడు “స్వామి” ఆ బాలికపై లైంగిక దాడికి దిగాడని తెలుస్తుంది. చివరికి నిజం తెలుసుకున్న ఆ తల్లి “స్వామి” కారణంగానే నాకూతురు గర్భం దాల్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇక నిందితుడు “స్వామి” కుటుంబం విషయానికివస్తే.. అతడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవటంతో ఆయన ఉద్యోగం కొడుకు “స్వామి”కి వచ్చింది. అతడికి గత రెండేళ్ల క్రితమే మరో మహిళాతో వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం “కైకలూరు”లో కాపురం పెట్టిన స్వామి, తల్లిని చూడడానికి తరచూ “గిలకలదిండి” వచ్చేవాడని, ఈ సందర్భంలో తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు చేసింది. ఆ బాలిక గర్భవతి అని తెలియగానే వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మచిలీపట్నం CI వాసవి, SI దుర్గాప్రసాద్, హాస్పటల్ కి చేరుకొని వచ్చి విచారణ చేపట్టారు.