పెళ్లైన తొలిరాత్రే దారుణం : పెళ్లి కూతురుపై బావతో కలిసి భర్త అత్యాచారం

0
151
పెళ్లైన తొలిరాత్రే దారుణం : పెళ్లి కూతురుపై బావతో కలిసి భర్త అత్యాచారం
పెళ్లైన తొలిరాత్రే దారుణం : పెళ్లి కూతురుపై బావతో కలిసి భర్త అత్యాచారం

నేటి సమాజంలో పెళ్లి బందానికి కూడా విలువలేకుండా పోయింది. ఖర్చు పెట్టడానికి డబ్బు, త్రాగడానికి మందు అంటే చాలు అనేలా ప్రవర్తిస్తున్నారు కొందరు సైకోలు. ఇక్కడ ఒక సైకో పెళ్లి కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, పెళ్లైన తొలి రాత్రే బావతో కలిసి కట్టుకున్న భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్నం సాకుగా చూపి మద్యం మత్తులో మృగంలా ప్రవర్తిస్తూ కొన్ని గంటలపాటు నవవధువుకి నరకం చూపించారు ఆ దుర్మార్గగులు.

ఈ నీచాతి నీచమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని “మజఫర్‌ నగర్‌” నగరంలో మార్చి 6వ తేదీనా చోటు చేసుకుంది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భారతదేశాన్ని కంటతడి పెట్టిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌ నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన ఓ యువకునితో మర్చి 6న వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆదేరోజు రాత్రి ఆ యువతిపై, ఆమెకు అన్నయ్య వరుస అయ్యే ఒక వ్యక్తితో కలిసి కట్టుకున్న భర్తే అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ సైకోలనుండి తప్పించుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొన్ని గంటల పాటు ఆ పెళ్లి కూతురును తీవ్రంగా కొట్టి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. “పెళ్లి రోజు కట్నం కోసం పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు గొడవ గొడవ చేశారు.. నిజానికి మేము అప్పటికే రూ.7 లక్షలు కట్నం ఇచ్చాము.. అయిన ఇంకా అడగడంతో ప్రశ్నించాం అంతే.. అడిగిన కట్నం ఇవ్వకుండా ఎదురు తిరుగుతారా ? అంటూ ఆదేరోజు రాత్రి వరుడు, అతని బావ ఇద్దరు కలిసి మద్యం సేవించి, మత్తులో తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డారు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.