టాప్ మోడ‌ల్‌కు పోటీగా 87 ఏళ్ల బామ్మ‌.. క్రికెట్ స్టేడియంలో ఏం చేసిందో తెలుసా..?

0
183

క్రికెట్ అంటే చాలు ఈ కాలం కుర్రోళ్లు చెవి కోసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కానీ, బామ్మ‌లు, పెద్ద‌వాళ్ల‌కు మాత్రం అదో న‌సకు మించి భారం వంటిది. ఇంట్లోని టీవీలో వ‌చ్చే సినిమాలో, సీరియ‌ళ్ల‌నో చూసి కాల‌క్షేపం చేస్తారే కానీ క్రికెట్ గురించి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించరు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు నేటి కుర్ర‌కారంతా టీవీల‌కు అతుక్కుపోతున్నారు. వీరిని చూసిన పెద్దోళ్లు మాత్రం విసుగుచెందుతుండ‌టం కామ‌న్ అయిపోయింది.

కానీ, ఈ ఫోటోలో క‌నిపిస్తున్న బామ్మ మాత్రం తాను మిగిలిన వారికి భిన్న‌మ‌ని నిరూపించారు. అచ్చం ప‌డుచుపిల్ల మాదిరిగానే క్రికెట్‌ను ఎంజాయ్ చేశారు. ఏకంగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌ను చూడ‌ట‌మే కాకుండా ఈల‌లుతో హోరెత్తించారు.

87 ఏళ్ల చారుల‌త ప‌టేల్ ఇప్పుడు క్రికెట్ వ‌ర‌ల్డ్‌లో హాట్ టాపిక్ అయింది. భార‌త్ – బంగ్లా మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన భామ్మ టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఫోర్లు, సిక్స్‌లు బాదిన‌ప్పుడ‌ల్లా విజుల్స్‌తో ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. బామ్మ ఉత్సాహాన్ని కెమెరామెన్‌లు ప్ర‌త్యేకంగా ఫోక‌స్‌చేసి చూప‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. భార‌త్ స్టార్ బ్యాట్స్‌మెన్స్ కోహ్లీ, రోహిత్‌శ‌ర్మ ఇద్ద‌రూ కూడా బామ్మ‌ను క‌లిశారు. క్రికెట్ అంటే ఇష్ట‌మున్న బామ్మ‌ను ఇంత‌కుమునుపెప్పుడు కూడా చూడ‌లేదంటూ ట్వీట్ చేశారు.

see also : క్రికెట‌ర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో టాప్ మోడ‌ల్‌..!