సీపీఎస్ ఫైన‌ల్ స‌ర్వే : ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం – అస‌లు లెక్క‌లు ఇవిగో..!!

0
947

హైద‌రాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సీపీఎస్ సంస్థ మార్చి 27 నుంచి 31 మ‌ధ్య మూడు ల‌క్ష‌ల‌కు పైగా శాంపిల్స్‌తో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్వే నిర్వ‌హించింది. ఈ సంస్థ 2006 నుంచి స‌ర్వేలు నిర్వ‌హిస్తోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి..? అన్న అంశాన్ని అంచ‌నా వేయ‌డంలో సీపీఎస్ సంస్థ క‌చ్చిత‌త్వం అనేక సార్లు రుజువైంది. 2009 ఎన్నిక‌ల నుంచి ఈ సంస్థ చెబుతున్న అంచ‌నాలు అక్ష‌రాల నిజ‌మ‌య్యాయి.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ సంస్థ చేసిన స‌ర్వేలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గన్ స్వీప్ చేస్తార‌ని సీపీఎస్ స‌ర్వే తేల్చింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తోపాటు స్థానికంగా ఎమ్మెల్యేల‌పై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేలో వెల్లడైంది. అయితే, చంద్ర‌బాబు దీని నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు సెంటిమెంట్ ఫ్యాక్ట‌ర్స్ తెర‌పైకి తెచ్చార‌ని, దానిని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌లేద‌ని సర్వే చెబుతోంది.

చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌లు ఎన్నిక‌ల తాయిళాలుగానే భావిస్తున్నార‌ని, ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకోవ‌డం కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపించింద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబుక‌న్నా జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ఎక్కువ విశ్వ‌స‌నీయ‌త ఉంద‌ని వెల్లడైంది.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైఎస్ జ‌గ‌న్‌కు 90 శాతం మంది మ‌ద్ద‌తు ఇస్తే చంద్ర‌బాబుకు కేవ‌లం ప‌ది శాతం మంది మాత్ర‌మే మ‌ద్ద‌తు ఇచ్చారు. ఈ సారి జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌న్న అభిప్రాయం అన్ని చోట్లా ప్ర‌జల్లో బ‌లంగా క‌నిపిస్తోందని స‌ర్వే తేల్చింది. ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయ నాయకుడిని కోరుకుంటున్నార‌ని జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.

ఈ అంశాల‌న్నిటిని ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన సీపీఎస్ స‌ర్వే సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంద‌ని స్ప‌ష్టం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు స‌ర్వేలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. సెంట‌ర్ ఫ‌ర్ సెఫాల‌జిస్ట్ సీపీఎస్ చేసిన తాజా స‌ర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని తేల్చ‌డంలో ఏపీలో తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది.

సెంట‌ర్ ఫ‌ర్ సెఫాల‌జిస్ట్ సీపీఎస్ సంస్థ చేసిన స‌ర్వే ప్ర‌కారం ఏపీలో రాజ‌కీయ పార్టీలు గెలుచుకునే ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల సంఖ్య‌ల ఇలా ఉన్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్థానాలు మొత్తం 175, అందులో

తెలుగుదేశం : 45 నుంచి 55
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 121 – 131
జ‌న‌సేన : 1 – 2
కాంగ్రెస్ : 0
బీజేపీ : 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్ల‌మెంట్ స్థానాలు స్థానాలు మొత్తం 25, అందులో

తెలుగుదేశం : 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 21
జ‌న‌సేన : 0
కాంగ్రెస్ : 0
బీజేపీ : 0