కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం : స్పందించిన CM కుమారస్వామి

0
126
కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం : స్పందించిన CM కుమారస్వామి
కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం : స్పందించిన CM కుమారస్వామి

కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 100 మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరోపక్క తీవ్రంగా గాయపడిన మరికొంత మందిని బయటకు తీసి హాస్పటల్ కి తరలించారు.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ధార్వాడ్‌ ‌లోని కమలేశ్వర్‌ నగర్‌ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాడు.

ఇక ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు పరిశీలిస్తే.. భవనంలోని 1, 2 అంతస్తుల్లో నిర్మాణం పూర్తై ఇప్పటికే కొంత మంది అద్దెకు ఉంటున్నారు. ఈమాద్యే పూర్తయిన 3వ అంతస్తుపై, 4వ అంతస్తు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నా సమయంలో అందరూ చూస్తుండగానే భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 1, 2 అంతస్తుల్లో నివసిస్తున్న వారితో పాటు నిర్మాణ కూలీలు కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఇదిలాఉంటే ప్రమాదం జరిగిన భవనం కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత “వినయ కులకర్ణి” బంధువులకు చెందినదిగా వార్తలు వస్తున్నాయి. నాసిరకం మెటీరియల్‌ వాడటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.