టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌..!

0
206

తెలంగాణ కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఇటీవ‌ల తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసిన ఆ కాంగ్రెస్‌కు మ‌రో కీల‌క నాయ‌కుడు గుడ్‌బై చెప్ప‌బోతున్నాడు. ఆయ‌నే రాష్ట్ర కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజాద్దీన్.

అయితే, ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ఎంపీ కుమార్తె వివాహానికి అజారుద్దీన్‌తోపాటు ప‌లు పార్టీల నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఆ వివాహంలోనే అజారుద్దీన్‌తో టీఆర్ఎస్ శ్రేణులు మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలుస్తుంది. ఆ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయిన కార‌ణంగానే అజారుద్దీన్ టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే అజారుద్దీన్ అతి త్వ‌ర‌లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేర‌నున్నార‌ని, సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ సీటు కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింద‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి.