చంద్రబాబుకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్..!

0
97

ఈ నెల 23న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలుపుపై గ‌ట్టి న‌మ్మ‌కంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వారి న‌మ్మ‌కానికి మ‌రింత బ‌లం చేకూరుస్తూ ప‌లు స‌ర్వే సంస్థ‌ల‌ ఏజెన్సీలు ఫ‌లితాలను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అధికారంలోకి వ‌చ్చేది త‌మ పార్టీనేన‌ని, త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

ఇలా అత్య‌ధిక ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌ను వైసీపీ గెల‌వ‌నుంద‌ని స‌ర్వేల‌ ఫ‌లితాలు చెబుతున్న నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌వైపు జాతీయ పార్టీల చూపు మ‌ళ్లింది. అందులో కాంగ్రెస్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నా, ఒక‌వేళ హంగ్ ఏర్ప‌డితే మిగిలిన ఎంపీ సీట్ల‌ను భర్తీ చేసేందుకు త‌మ‌కు మ‌ద్ద‌తు కావాలంటూ వైసీపీని కోరేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

ఆ మేర‌కు కాంగ్రెస్ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీని ఆ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఇప్ప‌టికే రంగంలోకి దించింద‌ని, వైసీపీ ముఖ్య నేత‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లోకి వెళ్లారంటూ ప‌లు ప్ర‌ధాన ప‌త్రిక‌లు క‌థ‌నాల‌ను కూడా ప్ర‌చురించాయి.

ఇలా వ‌స్తున్న క‌థ‌నాల‌పై వైఎస్ జ‌గ‌న్ సూటింగా స్పందించార‌ని, జాతీయ స్థాయిలో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌పై త‌న‌కు ఎటువంటి ప‌గ‌, ప్ర‌తీకారాలు లేవ‌ని చెప్తూనే, ఏపీకి ప్ర‌త్యేక హోదా, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించే పార్టీల‌కే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు జాతీయ స్థాయి మీడియా ఛానెళ్లు క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి.

ఈ విష‌యాన్నే కాంగ్రెస్ నేత చింతా మోహ‌న్ ప్ర‌స్తావిస్తూ, వైఎస్ జ‌గ‌న్ మా వాడే, కాంగ్రెస్ హ‌యాంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమారుడే, అంటే మావాడే నంటూ ప‌దే ప‌దే ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో చెప్ప‌డం గ‌మ‌నార్హం.