కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ.. నిరుత్సాప‌హ‌డొద్దు : కేసీఆర్‌

0
98

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న కాళేశ్వ‌రం మేడిగ‌డ్డ ప్రాజెక్టు బ్యారేజ్‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇవాళ ప‌రిశీలించారు. మేడిగ‌డ్డ ప్రాజెక్ట్ ప‌రిశీల‌న‌లో భాగంగా సీఎం కేసీఆర్ సంబంధిత అధికారుల‌తో క‌లిసి క‌లియ తిరిగారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ అధికారుల‌పై ఫైర‌య్యారు. నిర్మాణ ప‌నుల‌ను ఆల‌స్యం చేస్తున్నారంటూ అధికారుల ప‌నితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అయితే, మేడిగ‌డ్డ బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా మొత్తం 85 గేట్‌ల‌ను నిర్మించాల్సి ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 13 గేట్‌ల‌ను మాత్ర‌మే నిర్మించార‌ని, రానున్న వేస‌వి కాలం నాటికి బ్యారేజీ నిర్మ‌ణాన్ని పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్ర‌తీ రెండు రోజుల‌కోసారి మానిట‌రింగ్ చేస్తానంటూ అధికారుల‌ను కేసీఆర్ హెచ్చ‌రించారు.

అనంత‌రం, మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్వాసితుల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని ఎమ్మెల్యేలు శ్రీ‌ధ‌ర్‌బాబు, గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి సీఎం కేసీఆర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారినుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలైనంత మాత్రాన నిరుత్సాహ ప‌డొద్ద‌ని, అంద‌రం క‌లిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్ప‌డ‌దామంటూ పిలుపునిచ్చారు.